తెలంగాణలో మంగళవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఫలితాలను మంగళవారం తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ లో మొత్తం 2,94,378 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కాగా ఫలితాలు వెల్లడించిన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని చింతల్ బస్తి లో విషాద ఘటన చోటుచేసుకుంది.
ఇంటర్ ఎంపీసీ లో తక్కువ మార్కులతో పాస్ కావడంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చింతల్ బస్తీకి చెందిన విద్యార్థి గౌతమ్ కుమార్ (18) ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు మొదటిగా గౌతమ్ ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే మృతి చెందడంతో కేసు నమోదు చేసుకొని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.