ఈ క్రెడిట్ కార్డు వుందా..? అయితే తప్పక ఈ విషయం తెలుసుకోవాలి. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల మర్చెంట్స్ కి తీపికబురుని అందించింది. రూపేతో కలిసి ఎంఎస్ఎంఈ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా క్రెడిట్ కార్డు ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ కార్డు కేవలం మార్చేంట్లకి మాత్రమే.
మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ కొత్త క్రెడిట్ కార్డుని కనుక మార్చేంట్లు పొందారు అంటే.. ఈ కార్డుతో మర్చెంట్లు 50 రోజుల వరకు ఎలాంటి వడ్డీలు లేని రుణాలను పొందవచ్చు. మాములుగా వ్యాపారం చెయ్యాలంటే వ్యాపారులకు కొంత డబ్బులు కావాలి. పైగా తక్కువ కాల వ్యవధిలో డబ్బులు కావాల్సి ఉంటుంది.
దీని కోసం వారు ఎక్కువ వడ్డీ రేట్లకు రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ సమస్య లేకుండా ఈ కార్డుని తీసుకు రావడం జరిగింది. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన మర్చెంట్లకు 50 రోజుల పాటు ఎలాంటి వడ్డీలు లేని రుణాలను ఇస్తోంది. అంతే కాకుండా ఈ కార్డు తో మరిన్ని లాభాలు వున్నాయి. ఇక వాటి కోసం చూస్తే..
ఈ కార్డు ద్వారా రూ.10 లక్షల వరకు ఉచితంగా ప్రమాద బీమాను కూడా పొందడానికి అవుతుంది. డొమెస్టిక్ ఎయిర్ పోర్టు లాంజ్‌లలో క్వార్టర్‌కు రెండు సార్లు ఉచిత యాక్సస్ ని కూడా పొందొచ్చు. అంతే కాదండి దీనిని ఉపయోగిస్తే మర్చెంట్లకు రివార్డు పాయింట్లు కూడా వస్తాయి. ఈ రూపే క్రెడిట్ కార్డు ఎంఎస్ఎంఈల చెల్లింపు విధానాన్ని సులభతరం చేసారు. అలానే వేగవంతం కూడా.