పరిస్థితులు ఎదురుతిరిగితే.. ఓడలు బళ్లు అవుతాయి.. బళ్లు ఓడలు అవుతాయి అంటారు పెద్దలు. అచ్చు ఇలాగే జరుగుతోంది.. రాజకీయ ఫైర్ బ్రాండ్, టీడీపీ సీనియర్ నాయకుడు చింతమనేని ప్రభాకర్ విషయం లో అంటున్నారు పరిశీలకులు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి వరుస విజయా లు సాధించిన టీడీపీ నాయకుడిగా ఆయన తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు, తన వ్యవహా ర శైలితో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు సాధించారు. నోటి దురుసు, ఎలాంటి వారినైనా లెక్కచేయకపోవ డం, తాను అనుకున్నది సాధించడం వంటవిషయాల్లో చింతమనేనికి సాటి, పోటీ కూడా లేరనేది నిజం.
అయితే, గత ఏడాది ఎన్నికల్లో ఆయన జాతకం తిరగబడింది. టీడీపీ అధికారం కోల్పోయింది. అంతేకాదు, తనకు తిరుగులేదు, విజయం వరించడం ఖాయం, తనపై జగన్ కానీ, పవన్ కానీ ఎవరొచ్చి పోటీ చేసినా చి త్తుగా ఓడిస్తానని చెప్పిన చింతమేనిని దెందులూరు నియోజకవర్గంలో యువ నాయకుడు, ఎన్నారై వైసీపీ నేత అబ్బయ్య చౌదరిపై ఘోరంగా ఓడిపోయారు. ఈ క్రమంలో ఆయన హవా మొత్తం ఒక్కసారిగా దిగజారిం ది. ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీంతో దాదాపు రెండుమాసాలకు పైగా జైల్లోనే ఉన్నారు.
ఒకదానిలో బెయిల్ వస్తే.. మరోకేసులో జైలుకు వెళ్లాల్సి రావడంతో ఆయన బెయిల్‌పై బయటకు వచ్చేందుకు నానా కష్టాలు పడ్డారు. అయితే, ఆ తర్వాత కూడా ఆయన సైలెంట్ అయిపోయారు. గత జనవరిలో ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకునే కోడి పందేలకు దూరంగా ఉన్నారు. ఆయన నిర్వహించే బరులు బోసిపోయాయి. ఆయన కేసుల భయంతో ఎక్కడో దూరానికి వెళ్లి ఒంటరిగా గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లోకూడా ఆయన హవా ఎక్కడా కనిపించడంలేదు. ఒకప్పుడు వెంటతిరిగిన నాయకులు ఇప్పుడు ఆయనకు దూరమయ్యారు.
ప్రత్యర్థి పార్టీ నుంచి ఇంకా ఆయనకు కేసుల భయం వెంటాడుతూనే ఉంది. నోరు విప్పి ఏం మాట్లాడితే.. ఏం కేసులు పెడతారో.. ఎప్పుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందోనని ఆయన భయ పడుతున్నారు. అంతేకాదు, 2015లో జరిగిన వనజాక్షి ఘటనపై ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తిరగదోడేందు కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి చింతమనేని ఎలా అయిపోయారు! అనే చర్చ నియో జకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడాజోరుగా సాగుతుండడం గమనార్హం.