ప్రపంచాన్ని ఒణికిస్తున్న కరోనా వైరస్ గురించి ఇప్పటికే చాలా ప్రచారం జరుగుతోంది. అయితే, వాస్తవానికి ఈ వైరస్‌పై ఎంత చెప్పుకొన్నా.. కొన్ని నిజాలు మాత్రం ప్రజల మనసుల్లోకి ఎక్కడం లేదు. అవేంటంటే.. ఈ వైరస్ చాలా సున్నితం.. అదేసమయంలో ప్రాణాంతకం. కాబట్టి ఇది ఎక్కడెక్కడ ఉంటుంది? ఎలా వ్యాపిస్తుంది? ఎవరికెవరికి ప్రమాదకరం? అనే విషయాలు సంక్షిప్తంగా తెలుసుకుందాం.
+ కరోనా వైరస్ దీనిని కొవిడ్-19గా పేర్కొన్నారు. దీనికి కారణం.. కరోనా వైరస్ అనేది కొత్తకాదు. పాతదే. మనకు గొంతులో గరగరమన్నా. ఫ్లూ వచ్చినా.. దానికి కరోనా వైరస్ కారణం. కానీ, కొవిడ్ -19 అనేది బాగా అభివృద్ధి చెందిన దశలో ఉన్న వైరస్. ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని క్షీణింపజేస్తుంది. సో.. అందుకే మరణాలు సంభవిస్తున్నాయి.
+ ఇక, కరోనా వ్యాప్తి ఎలా జరుగుతుందనే విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఈ విషయంలో కీలక మైంది. గాలి ద్వారా కరోనా వ్యాపించదు. దీనికి ప్రదాన కారణం. గాలిలో ఈ వైరస్ నిలిచి ప్రయాణించలేదు. కింద పడిపోయే లక్షణం లేదా ఏదైనా ఓ వాహకాన్ని పట్టుకుని ఉండే లక్షణం ఈ వైరస్‌ది.
+ అంటే.. కొవిడ్-19 ఉన్న వ్యక్తి దగ్గినా.. తుమ్మినా.. అతని లాలాజలం నుంచి వచ్చే ఈ వైరస్.. వెంటనే సమీపంలోని వాహకాన్ని పట్టుకుని ఉంటుంది.(గాలిలో కాదు)
+ చేతులకు అంటుకుంటే నాలుగు గంటల వరకు అది జీవించి ఉంటుంది. అందుకే ప్రతి అరగంటకు ఒకసారి చేతులు శానిటైజ్ చేసుకోవాలి.
+ అదే వాటర్ బాటిల్ (ప్లాస్టిక్)కి ఈ వైరస్ అంటుకుంటే 72 గంటలు జీవించి ఉంటుంది.
+ ఐరన్, స్టీల్ పాత్రలకు, వెండి,బంగారు వస్తువులు, ఉంగరాలకు అంటుకుంటే 42 గంటల పాటు జీవించి ఉంటుంది.
+ నీళ్లలో ఈ వైరస్ ఉండలేదు. చనిపోతుంది. అందుకే నీళ్లతో చేతులు ముఖం కడుక్కున్నా ప్రయోజనం ఉంటుంది.
+ ఇక, చేతులకు అంటుకున్న మాత్రాన వ్యక్తికి కొవిడ్-19 అంటుకున్నట్టు కాదు. ఆ చేతుల ద్వారా నోటిని, ముక్కును, కళ్లను తాకినట్టయితే. వాటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంటే.. కేవలం చేతులను పదే పదే శుభ్రం చేసుకోవడం ద్వారా, మన పరిసరాల్లోని వస్తువులను పరిశుభ్రంగా ఉంచుకోవడంద్వారా దీనికి దూరంగా ఉండొచ్చు.
+ మరో కీలక విషయం ఏంటంటే.. కొవిడ్-19 వస్తే.. ఈ వ్యాధి లక్షణాలు బయట పడేందుకు రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది. అందుకే మన దేశంలో మూడు వారాల లాక్‌డౌన్ విధించారు. ఆ తర్వాత ఎంత మందికి కరొనా వచ్చిందనేది స్పష్టంగా తెలుస్తుందన్న మాట!