ప్రమాదకరమైన కరోనా వైరస్ నీ ఎదుర్కొంటున్న దేశాలలో ప్రపంచం లోనే భారతదేశం చేసే యుద్ధం ఒక ఎత్తు అయితే, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న యుద్ధం మరొక ఎత్తు. కరోనా వైరస్ అరికట్టడం విషయంలో వైయస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఢిల్లీ పెద్దలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దేశంలో ఉన్న కొద్ది ఈ వైరస్ ప్రభావం రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో కేంద్రంలో అలజడి మొదలైంది. దక్షిణాది రాష్ట్రాలలో కేరళలో మరియు కర్ణాటకలో అదేవిధంగా తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో వైరస్ రోజురోజుకూ పెరుగుతున్నాయి.కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఎక్కడికక్కడ వైరస్ సోకకుండా వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశంలోని హైలెట్ గా తల పండిపోయిన రాజకీయ నేతలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. పరిపాలనలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి జగన్ తీసుకుంటున్న చర్యల పట్ల ఢిల్లీ పెద్దలు శభాష్ జగన్ అంటూ మెచ్చుకుంటున్నారు. వైరస్ ఎక్కువగా విదేశాల నుండి వచ్చిన వాళ్ళ వల్ల ఇతరులకు సోకే ప్రమాదం ఉండటంతో…వాళ్ళ ను ముందే గుర్తించడం లో వైఎస్ జగన్ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సక్సెస్ అయ్యారు. దీంతో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి వైరస్ రాష్ట్రంలో ఎక్కువ ప్రబలకుండా ముందే గుర్తించగలిగారు. అంతేకాకుండా జిల్లా కి ఒక IAS అధికారిని నియమిస్తూ ప్రభుత్వం తరఫున జీవోలు జారీ చేస్తూ కట్టుదిట్టంగా వ్యవహరించారు.
శ్రీకాకుళం – ఎంఎం నాయక్
విజయనగరం – వివేక్ యాదవ్
విశాఖ – కాటంనేని భాస్కర్
తూర్పు గోదావరి – రాజశేఖర్
పశ్చిమగోదావరి – ప్రవీణ్ కుమార్
కృష్ణా – సిద్దార్థ్ జైన్
గుంటూరు – కాంతిలాల్ దండే
ప్రకాశం – ఉదయ లక్ష్మి
నెల్లూరు – బి.శ్రీధర్
కర్నూలు – పీయూష్ కుమార్
కడప – శశిభూషన్ కుమార్
అనంతపురం – భాస్కరరావు నాయుడు
చిత్తూరు – రాంగోపాల్