వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవే…!

-

నేటి ఆధునిక ప్రపంచంలో మనం తీసుకునే ఆహారంలో శరీరానికి కావాల్సిన పోషకాలు అందకపోవడం వల్ల ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. అందుకే వాతావరణంలో చిన్న చిన్న మార్పులు కూడా తట్టుకునే శక్తి మన శరీరానికి లేకుండా పోతుంది. మన ఆహారంలో కొద్దిగా మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజుల్లో వచ్చే వైరస్ లు, బాక్టీరియా ల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే మన పెరట్లో ఉన్న ఆకు కూరలు, కాయ కూరలు మరియు మన వంటింటిలో ఉండే పసుపు, ఆవాలు, ఇంగువ, ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు వంటివి డ్రై ఫ్రూట్స్, నట్స్ లు కూడా మన ఇమ్యూనిటి పవర్ ని పెంచుతాయి. ఇవే కాక గ్రీన్ టీ, బ్లాక్ టీ, పాలు, పెరుగు, మాంసాహారం, చేపలు వంటి వాటిలో సమృద్ధిగా విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి.

ఆకు కూరల్లో సమృద్దిగా విటమిన్ సి, ఏ, ఈ, పైబర్, యాంటి ఆక్సిడెంట్లు ఉంది మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ని పెంచుతాయి. క్యారెట్, చిలకడ దుంపలు , బొప్పాయి, టమాటా ల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవే కాకుండా రోజు ఉదయం పుట ఎండలో కాసేపు గడిపితే శరీరాన్ని ఎంతో శక్తివంతంగా మార్చుకోవచ్చు. ఈ ఆహారపు అలవాట్లను క్రమం తప్పకుండా పాటిస్తే బయటి నుండి వచ్చే వైరస్ ల పై మన శరీరం తట్టుకుని పోరాడగలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news