టీడీపీ అతితెలివి.. క‌రోనాపై ఇంత చీప్‌గానా…?

-

రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఎలా జ‌రుగుతోందో .. అంద‌రికీ తెలిసిందే. ఇది సైలెంట్ ‌గా వ్యాపిస్తున్న వ్యాధి. ఇత మిత్థంగా ఇదీ కార‌ణ‌మ‌ని చెప్పే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. క‌రానో వ్యాప్తిపై ఎవ‌రూ ఎలాంటి కార‌ణాలు చెప్ప‌లేక పోతున్నారు. అదేస‌మ‌యంలో ఎలాంటి ల‌క్ష‌ణాలు లేనివారికి కూడా వైర‌స్ క‌నిపిస్తోంది. అయితే, స‌మూహ వ్యాప్తి ప్ర‌మాద‌క‌రంగా ఉంటుంద‌ని భావించి.. అంటే వైర‌స్ ఉన్న వారి నుంచి అత్యంత వేగంగా ప‌క్క‌వారికి వ్యాపించే అవ‌కాశం ఉంటుంది. దీనిని గ‌మ‌నించిన కేంద్ర ప్ర భుత్వం వెంట‌నే లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. భౌతిక దూరాన్ని పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే, తాజాగా క‌రోనాను త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్న టీడీపీ నాయ‌కులు ఏపీలో ప్ర‌భుత్వంపై నా.. అధికార పార్టీ ఎమ్మెల్యేల‌పైనా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. ప్ర‌కాశంలో క‌నిగిరి ఎమ్మెల్యే బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్‌.. బెంగ‌ళూరు నుంచి 50 మంది త‌న అనుచ‌రు లను వెంటేసుకుని వ‌చ్చార‌ని ఆయ‌న నిబంధ‌న‌లు పాటించ‌లేదు కాబ‌ట్టి.. వైర‌స్ వ్యాప్తి చెందింద‌ని టీడీ పీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ముక్తాయించారు.

ఇక‌, అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గంమాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పందిస్తూ.. శ్రీకాళ‌హ‌స్తిలో ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న‌రెడ్డి ర్యాలీ నిర్వ‌హించాడ‌ని, అందుకే క‌రోనా అక్క‌డ క‌రాళ నృత్యం చేస్తోంద‌న్నారు. అదే స‌మ‌యంలో చిత్తూరు జిల్లా న‌గ‌రిలోనూ ఓ బోరు ప్రారంభోత్స‌వంలో రోజా పాల్గొన్న‌ప్పుడు నిబంధ‌న ‌లు పాటించ‌లేద‌ని, అందుకే అక్క‌డ క‌రోనా వ్యాప్తి చెందింద‌ని త‌మ్ముళ్లు వితండ వాదాన్ని తెర‌మీదికి తె చ్చారు.

నిజానికి నాయ‌కులు నిర్వ‌హించిన ర్యాలీలు, ప్రారంభోత్స‌వాల వ‌ల్లే.. రాష్ట్రంలో క‌రోనా వ్యాపించి ఉంటే.. దేశంలో ప‌రిస్థితి ఏంటి?  ప‌క్క‌రాష్ట్రం తెలంగాణ‌లో ప‌రిస్థితి ఏంటి? అనేది కూడా త‌మ్ముళ్లు చెప్పాల్సి ఉంటుంది. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. దానిని రాజ‌కీయాల‌కు ముడిపెట్ట‌డం వ‌ల్ల పొందే ప్ర‌యోజ‌నం కంటే.. స్వ‌యంగా ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు చేయాల్సిన ప‌నిని మ‌రిచిపోవ‌డం మాత్రం తీవ్ర వివాదానికి ఆస్కారం ఇస్తోంద‌న్న విష‌యాన్ని గుర్తించాల‌ని సూచిస్తున్నారు టీడీపీ సానుభూతి ప‌రులు!

Read more RELATED
Recommended to you

Latest news