ఏపీ రాజకీయంలో ఇంట్రెస్టింగ్ సీన్….మాజీ ముఖ్యమంత్రి జగన్ కు చంద్రబాబు ఫోన్

-

ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సమయం ఆసన్నమైంది. బుధవారం 11.27 నిమిషాలకు నాలుగో సారి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా ఈ నెల12న చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ముమ్మరంగా జరుగుతున్నాయి.బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు కేంద్రమంత్రులు అమిత్ షా, బండి సంజయ్,పవన్ కల్యాణ్, స్టార్ హీరోలు చిరంజీవి, రజినీకాంత్‌లు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఈ మేరకు మంగళవారం జగన్‌కు చంద్రబాబు ఫోన్ చేశారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించడానికి ప్రయత్నం చేశారు. అయితే, చంద్రబాబు ఫోన్‌కు జగన్ అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరు కావడం లేదని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news