చంద్రబాబు ప్రమాణ స్వీకారం…విజయవాడ చేరుకున్న చిరంజీవి, రజనీకాంత్

-

ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా ఈ నెల12న చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ముమ్మరంగా జరుగుతున్నాయి.బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు విచ్చేస్తుండటంతో దాదాపు 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే… మెగాస్టార్ చిరంజీవి కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యారు. భార్య సురేఖ, ఇతర కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అటు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్నారు. అటు కేంద్రమంత్రులు జేపీ నడ్డా, అమిత్ కూడా కాసేపట్లో ఏపీకి రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news