మ‌హేష్‌కు ఆ ముగ్గురు టాప్ డైరెక్ట‌ర్ల‌తో ఎక్క‌డ చెడింది…?

-

టాలీవుడ్‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుకు సాఫ్ట్ పర్స‌న్‌గా మంచి పేరు ఉంది. ఒక‌సారి ఎవ‌రైనా ద‌ర్శ‌కుడికి క‌థ విష‌యంలో ఓకే చెపితే మ‌నోడు క‌థ‌లో అస్సలు జోక్యం చేసుకోడ‌ని.. డైరెక్ట‌ర్ ఎలా చెపితే అలా చేసుకుంటూ వెళ్లిపోతాడ‌న్న టాక్ ఉంది. అందుకే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా మ‌హేష్‌తో సినిమాలు చేసేందుకు చాలా ఆస‌క్తితో ఉంటారు. ఎవ్వ‌రితోనూ వివాదాలు పెట్టుకునేంద‌కు మ‌హేష్ ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌డు.

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం మ‌హేష్ డైరెక్ట‌ర్ల‌తో ఎందుకు పెట్టుకుంటున్నాడు అన్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీలో స్టార్ట్ అయ్యాయి. ఇండస్ట్రీలోని ముగ్గురు టాప్ డైరక్టర్లతో భేదాభిప్రాయాలు కొనితెచ్చుకోవడమే ఇందుకు ఉదాహరణగా చెపుతున్నారు. రంగ‌స్థ‌లం లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇచ్చాక సుకుమార్ మ‌హేష్ కోసం ఏకంగా సంవ‌త్స‌రం వెయిట్ చేశాడు. సుకుమార్‌ను ప‌దే ప‌దే తిప్పించుకున్న మ‌హేష్ చివ‌ర‌కు అనిల్ రావిపూడితో క‌మిట్ అయ్యాడు.

మ‌హేష్ తీరుతో విసిగిపోయిన సుక్కు చివ‌ర‌కు బ‌న్నీతో క‌మిట్ అయ్యాడు. ఇక పూరితో కూడా మ‌హేష్‌కు గ్యాప్ వ‌చ్చింది. మ‌హ‌ర్షి ఫంక్ష‌న్‌లో మ‌హేష్ తన కెరీర్లో బెస్ట్ సినిమాలిచ్చిన దర్శకులందరి పేర్లు చెప్పి పూరి పేరు చెప్ప‌లేదు. ఇక పూరి కూడా మ‌హేష్‌కు స‌క్సెస్‌లు ఉన్న‌ప్పుడే క‌న‌ప‌డ‌తాం అంటూ సెటైర్ కూడా వేశాడు. ఇక ఇప్పుడు త్రివిక్ర‌మ్‌తో గొడ‌వ తానే కావాల‌ని పెట్టుకున్న‌ట్టు అయ్యింది.

త్రివిక్ర‌మ్ సినిమాకు పోటీగా త‌న సినిమాను అదే రోజు కావాల‌ని రిలీజ్ చేస్తుండ‌డంతో త్రివిక్ర‌మ్ సైతం మ‌హేష్ తీరుపై అస‌హ‌నంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. కమల్ హాసన్ కు బర్త్ డే విసెష్ చెప్పి అదేరోజు పుట్టినరోజు జరుపుకున్న త్రివిక్రమ్‌కు విషెస్ చెప్ప‌క‌పోవ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ ఉంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా మ‌హేష్ ఈ డైరెక్ట‌ర్ల విష‌యంలో ఎందుకు ? ఇలా ప్ర‌వ‌రిస్తున్నాడో ? ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news