ఆ పక్షి కోసం ప్రాజెక్ట్ ఎందుకు ఆపేసారు…? అసలు ఇప్పుడు ఆ పక్షి ఉందా లేదా…?

-

అడువులు అరుదైన జీవ జాతులకు ఆధారాలు. ప్రపంచానికి తెలియని ఎన్నో జీవులను మనకు పరిచయం చేసినవి అడువులే. ప్రకృతి ప్రసాదించిన వనరులే కాదు… ఎన్నో జీవులను కూడా మనకు అందించి వాటి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునే విధంగా చేశాయి అసువులు. అయితే కాల క్రమేణా కొన్ని జీవ జాతులు మానవ తప్పిదాల వలన అంతరించి పోయే స్థితికి వచ్చాయి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న అడవుల నరికివేత ఇప్పుడు కొన్ని ప్రాణుల ఉనికినే ప్రశ్నార్థకం చేసింది అనేది వాస్తవం. ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది…

తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని అరుదైన జాతులు బయటపడ్డాయి. నల్లమల అడవుల్లో, శేషాచలం అడవుల్లో వాటిని గుర్తించారు. ఇలా గుర్తించిందే ఒక పక్షి… దాని పేరే కలివి కోడి. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో అరుదుగా కనిపించే ఒక రకం పక్షి ఇది. ఇంగ్లిష్‌లో దీన్ని జెర్డాన్స్ కోర్సర్ అంటారు. ఐతన్న అనే స్థానిక గొర్రెల కాపరి 1986 జనవరి 5న ఈ పక్షిని పట్టుకోవడంతో ప్రపంచమంతా దీని గురించి గురించి తెలుసుకునే అవకాశం దొరికింది. భారత పక్షి శాస్త్ర పితామహుడిగా పిలిచే సలీం అలీ కూడా దీని గురించి తెలుసుకునే ప్రయత్నం ఎక్కువగానే చేశారు. 

అప్పుడు ఆయన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం ఆయన్ను వాచర్ గా నియమించడం విశేషం. ఆ పక్షి ఆవాస ప్రాంతం నుంచే తెలుగు గంగ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుండటంతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపేసారు అధికారులు. అయితే ఇప్పుడు ఆ పక్షి ఉందా లేదా అనే దానిపై మాత్రం ఎలాంటి ఆధారాలు లేకపోయినా… ఒక ప్రముఖ విశ్వ విద్యాలయం నుంచి వచ్చిన కొందరు పరిశోధకులు మాత్రం ఇప్పుడు ఆ పక్షిని గుర్తించే పనిలో పడ్డారు. ముఖ్యంగా నల్లమల అడవుల్లో గత ఏడాది ఈ పక్షి కోసం ఒక బృందం కూడా తిరిగిందని చెప్తారు. 

Read more RELATED
Recommended to you

Latest news