కేంద్రం కీలక నిర్ణయం… ఇంటర్నేషన్ విమానాలపై జనవరి 31 వరకు నిషేధం.

-

అంతర్జాతీయ విమానాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నేషన్ కమర్షియల్ విమాన సర్వీసులపై జనవరి 31 వరకు నిషేధాన్ని పొడగించారు. ఓమిక్రాన్ భయాల వల్ల ఇటీవల రెగ్యులర్ ఇంటర్నేషన్ విమానాలపై నిషేధాన్ని విధిస్తూ.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవల డిసెంబర్ 15 నుంచి రెగ్యులర్ ఇంటర్నేషనల్ ప్లైట్స్ ప్రారంభించాలని అనుకున్నారు. అయితే ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచంలో విస్తరించడంతో ఈ నిర్ణయాన్ని మార్చకున్నారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ విమానాలపై మరింత కాలం నిషేధాన్ని పొడగించారు.

విమానం

ఇటీవల పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా డిసెంబర్ 15 నుంచి రెగ్యులర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ప్రారంభిస్తామని ప్రకటించారు. అయితే దక్షిణాఫ్రికా లో కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ బయటపడటంతో కేంద్రం అలెర్ట్ అయింది. ఓమిక్రాన్ నేపథ్యంలో ప్రధాని మోదీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ విమానాల పునరుద్దరణను పరిశీలించాల్సిందిగా కోరారు. దీంతో అధికారులు అంతర్జాతీయ విమానాల పునరుద్దరణకు బ్రేక్ పడింది. అయితే పరిస్థితులను బట్టి జనవరి 31 తర్వాత విమానాలు ప్రారంభం అవుతాయో..లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news