పాఠం నేర్పిన పాము.. ఇకపై అలా చేయొద్దంటున్నాడు..!

-

చైనా: పామును కొని ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన హిలాంగ్జియాగ్ ప్రావిన్స్‌లో జరిగింది. లియూ అనే వ్యక్తి జంతు ప్రేమికుడు. విషపూరితం కాని పామును పెంచుకోవాలనుకున్నారు. మీటర్ పొడవున్న కోబ్రా కావాలని ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ప్రకారం కోబ్రాను లియూకు డెలీవరీ చేశారు. అప్పటి నుంచి ఆ పామును లియూ జాగ్రత్తగా పెంచుకుంటున్నారు. రాత్రి సమయంలో పామును తన పక్కనే మంచంపై పడుకోబెట్టుకునేవారు.

అయితే లియూకు ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. మంచంపై పనుకున్న సమయంలో లియూ తొడపై కోబ్రా కాటు వేసింది. దీంతో అతని పరిస్థితి విషమించింది. వెంటనే ఆస్పత్రి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతో ప్రాణపాయం తప్పింది. పాము కోరల్లో విషం ఉందన్న విషయాన్ని లియూకు వైద్యులు తెలిపారు. కాస్త ఆలస్యమై ఉంటే ప్రాణం పోయేదని చెప్పారు.

దాంతో లియూ వెంటనే వెళ్లి పామును అమ్మిన వ్యక్తిని కలిశాడు. పాముకు కోరలు తీయలేదని, విషం ఉంటుందని విక్రయందారుడు ఒప్పుకున్నారు. ఒక్కసారిగా షాక్ గురైన లియూ ఇకపై పామును పెంపుడు జంతువుగా పెంచుకోకూడదని నిర్ణయించుకున్నారు. కోబ్రాను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఎవరూ పామును పెంచుకోవద్దని లియూ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news