మీరు రొమాంటిక్ అని చెప్పడానికి ఎలాంటి లక్షణాలు పెంపొందించుకోవాలో తెలుసా?

భార్యాభర్తల బంధం సాఫీగా సాగడానికి వారి రోజువారి జీవితంలో రొమాన్స్ ఉండాలి. మీ భాగస్వామి మిమ్మల్ని రొమాంటిక్ అనుకునేలా చేస్తే ఆ బంధం గట్టిగా అవుతుంది. రొమాంటిక్ గా ఉండడం వల్ల చిన్న చిన్న గొడవలు చిన్నగానే సమసిపోతాయి. అవి పెద్దగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఇంతకీ రొమాంటిక్ గా ఉండడానికి ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలుసా? మీరు రొమాంటిక్ అని అవతలి వారు మీ గురించి మాట్లాడడానికి మీలో ఎలాంటి లక్షణాలు పెంపొందించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఆప్యాయత, అభిమానం

అవతలి వారి పట్ల అభిమానాన్ని చూపాలి. మాటల ద్వారా గానీ, చేతల ద్వారా గానీ భాగస్వామి పట్ల ఆప్యాయత కనబర్చాలి. పొద్దున్న లేవగానే వేడి వేడి కాఫీ అందించడం, నడుస్తున్నప్పుడు చేతిలో చేయి వేయడం, చిన్న స్పర్శ, చిన్న ముద్దు.. ఇవన్నీ ఆప్యాయత కిందకే వస్తాయి.

ఆలోచన

మీ భాగస్వామి అవసరాలు గుర్తించే ఆలోచన కలిగి ఉండాలి. ఎప్పుడైనా సరే భాగస్వామి అవసరాలను గుర్తించేలా ఉండాలి. అలా గుర్తించిన వాటిని తీసుకువచ్చి సర్పైజ్ ఇవ్వాలి. ఇది మీ బంధాన్ని బలపర్చడంలో బాగా సాయపడుతుంది.

అంకితభావం

భాగస్వామికి ఇచ్చే బహుమతుల్లో ప్రత్యేకత ఉండాలి. అది తమకోసమే ప్రత్యేకంగా చేసినట్టుగా అనిపించాలి. ఏదో ఒక బహుమతి అన్నట్టు కాకుండా బహుమతిని ఆమెకి ఇవ్వడంలో ప్రాముఖ్యత కనబడాలి. రొమాంటిక్ పర్సన్స్ మాత్రమే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు.

స్థిరత్వం

ఏదో ఒక మూమెంట్ బట్టి కాకుండా ఎప్పుడూ తమ భాగస్వామిపై ఒకే ఆలోచనతో ఉంటారు. స్థిరత్వం లేని వారు ఒకే వ్యక్తిని ఎప్పుడూ ఒకేలా ప్రేమించలేరు. రొమాంటిక్ పర్సన్స్ కి మిగతా వారికి ఉండే తేడా అదే.