తెలంగాణ: రేపటి నుండే డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటు..

-

కరోనాపై పోరాటం నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు తమ వంతు కృషిని చేస్తున్నాయి. ఇప్పటికే కేరళ ప్రభుత్వం కోవిడ్ బడ్జెట్ పేరుతో 20వేల కోట్ల రూపాయలని ప్రవేశ పెట్టింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. కరోనాతో పాటు ఇతర వ్యాధుల నిర్ధారణ పరీక్షల కోసం రాష్ట్రమంతటా డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ ప్రక్రియ రేపటి నుండే ప్రారంభం అవుతుందని ప్రకటించారు. కరోనా మూడవ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని మాటలు వినిపిస్తున్న తరుణంలో ఈ డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశించారు.

ప్రస్తుతానికి 19జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటు జరగనుంది. ఈ డయాగ్నస్టిక్ సెంటర్లలో 57పరీక్షలు ఉచితంగా జరుపుతారు. జిల్లా కేంద్రాల్లో ఈ డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటు ఉండనుంది. ఇదిలా ఉంటే, ఇప్పటికే వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుంది. సూపర్ స్ప్రెడర్స్ పిలవబడే వారందరికీ వ్యాక్సిన్లు వేయడానికి రాష్ట్రప్రభుత్వం నిశ్చయించింది. ఈ మేరకు హైదారబాద్ సహా పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news