BREAKING : గాల్లో ఢీకొన్న 2 హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి

-

మలేసియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు గగనతలంలో పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది సిబ్బంది మృతి చెందారు. విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల జపాన్లోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

మలేసియాలో ఏప్రిల్‌ 26వ తేదీన రాయల్‌ మలేసియన్‌ నేవీ దినోత్సవం జరగనున్న నేపథ్యంలో పెరక్‌లోని లుమత్‌ ప్రాంతంలో ఈరోజు రిహార్సల్స్‌ నిర్వహించారు. శిక్షణ విన్యాసాల నిమిత్తం పడంగ్‌ సితియావాన్‌ నుంచి గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్ది క్షణాలకే ప్రమాదవశాత్తూ ఢీ కొని కుప్పకూలాయి. వీటిల్లో ఒకటి విన్యాసాలు జరుగుతున్న ప్రాంతానికి పక్కనే ఉన్న స్థానిక స్టేడియంలో కూలిపోయాయి. మరొకటి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో రెండు హెలికాప్టర్లలో ఉన్న 10 మంది సిబ్బంది మృతి చెందారు. వీరిలో ఇద్దరు లెఫ్టినెంట్‌ కమాండర్లు ఉన్నారు. హెలికాప్టర్లు కూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news