BRSకు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ లోకి మరో BRS నేత వెళ్లనున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా DCCB చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి రెడీ అయ్యారని సమాచారం. మంత్రి దామోదర రాజనర్సింహతో భేటీ అయ్యారు చిట్టి దేవేందర్ రెడ్డి.
దీంతో త్వరలో ఉమ్మడి మెదక్ జిల్లా DCCB చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం..ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారట చిట్టి దేవేందర్ రెడ్డి.