BREAKING : విరిగిపడ్డ మట్టి చరియలు.. 11 మంది మృతి

-

చైనాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఆగ్నేయ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు మట్టిచరియలు విరిగిపడటంతో ఈ ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. హునన్‌ ప్రావిన్సులోని హెంగ్‌యాంగ్‌ నగర పరిధిలో ఉన్న యూలిన్‌ గ్రామంలోని ఓ ఇంటిపై ఆదివారం ఉదయం మట్టిచరియలు విరిగిపడ్డట్లు స్థానిక అధికారులు తెలిపారు. 18 మంది మట్టిచరియల కింద చిక్కుకోగా.. ఆరుగురిని రక్షించినట్లు వెల్లడించారు. మరొకరి ఆచూకీకి సంబంధించి ఎలాంటి విషయాలు వెల్లడించలేదు.

గేమి తుపాను కారణంగా చైనాలో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ తుపాను బలహీనపడినప్పటికీ.. ఇంకా వానలు విస్తారంగా కురుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా పర్వతాల పైనుంచి వస్తున్న నీటి వల్లే మట్టిచరియలు విరిగిపడ్డాయని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు భారీ వర్షాల వల్ల చైనాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ మరణాలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి షాంఘై నగరంలో ఓ భారీ చెట్టు నేలకూలిన ఘటనలో ఓ డెలివరీ బాయ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news