బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ప్రస్తుతం బాలీవుడ్‌తోపాటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. అయితే ఇటీవల ఆమెకు సంబంధించిన ఓ వీడియో (బాత్రూమ్ వైరల్ వీడియో) నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ అది మూవీ షూటింగ్‌లో క్లిప్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
‘‘నేను నటిస్తోన్న కొత్త చిత్రం ‘గుస్పేటియా’. ఆ సినిమాలో నాపై చిత్రీకరించిన ఓ సీన్ ఇటీవల నెట్టింట వైరల్‌గా మారింది. అది నన్నెంతో బాధించింది. సినిమా విడుదలకు ముందే వీడియోస్, ఫొటోలు లీక్ కావడం నిరాశకు గురిచేసింది. అది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియో కాదు. ఏ అమ్మాయికి ఇలాంటి చేదు అనుభవం ఎదురుకాకూడదని కోరకుంటా’’ అని ఊర్వశి ఆ పోస్టులో చెప్పుకొచ్చింది.
బాలకృష్ణ నటిస్తున్న 109 చిత్రంలో ఊర్వశీ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా సెట్‌లో తనకు స్వల్ప గాయాలయ్యాయని ఇటీవల ఆమె పోస్ట్ పెట్టింది. మరోవైపు ‘గుస్పేటియా’ చిత్రానికి సూషి గణేషన్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 9న ఇది విడుదల కానుంది.