ఈ ఏడాది 2023 అత్యుష్ణ సంవత్సరంగా నిలిచిపోనుంది ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. 2015-2023 మధ్యకాలం వాతావరణ రికార్డుల్లో అత్యుష్ణ కాలంగా నమోదైందని… ఈ ఏడాది దుబాయ్‌లో జరుగుతున్న కాప్-28 వాతావరణ సభకు సమర్పించిన నివేదికలో డబ్ల్యూఎంవో ఈ అంశాలను వెల్లడించింది. 2023లోనే భూతాపం పెరుగుదల 1.4 డిగ్రీలకు చేరుకుందని తెలిపింది. ఎల్‌నినో వల్ల ఆగ్నేయాసియాలో రుతు పవనాలపై ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొంది. అదే జరిగితే రానున్న వేలాది సంవత్సరాల్లో సముద్ర మట్టాలు పొంగడం, హిమనదాలు కరిగి నీరవడం, వరదలు, వడదెబ్బలు, కార్చిచ్చులు పేట్రేగిపోతాయని హెచ్చరించింది.
ఏడాది దక్షిణ భారతంలోకన్నా ఉత్తర భారతంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. హిమాలయాల్లో హిమనదాలు భూతాపం వల్ల మరింత వేగంగా కరిగిపోనుండటం వల్ల.. దీనివల్ల మున్ముందు ఉద్ధృతంగా వరదలు వస్తాయని బ్రిటిష్ వాతావరణ శాస్త్రజ్ఞుడు డాక్టర్ అక్షయ్ దేవరస్ హెచ్చరించారు. 2023 సిక్కిం వరదలు, 2022 పాకిస్థాన్ వరదల వంటివి మరింత ఎక్కువగా ఎదురవుతాయని తెలిపారు.