వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ ప్రజలకి ఒక వార్నింగ్ ఇస్తోంది. డబ్ల్యూహెచ్వో ప్రకారం 2050 సంవత్సరానికి 700 మిలియన్ మంది చెవులకి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 400 మిలియన్ మందికి హియరింగ్ ప్రాబ్లం వచ్చింది. రాను రాను ఇది మరింత ప్రమాదంగా మారుతుంది. అయితే రిపోర్టు ప్రకారం 700 మిలియన్ పైగా జనం ఇబ్బందికి గురి అవుతారు అని చెప్పింది. దీనికి గల కారణాలు చాలానే ఉన్నాయి.
కానీ పెద్ద కారణం ఏమిటంటే ఎక్కువసేపు వాల్యూమ్ ఎక్కువగా పెట్టుకుని వినడం వల్లనే. మార్చి 3న వరల్డ్ హియరింగ్ డే సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి కొన్ని విషయాలు చెప్పింది. Dr. Shuchin Bajaj, Ujala Cygnus Group of Hospitals ఫౌండర్ మరియు డైరెక్టర్ ఎటువంటి వాళ్ళు ఈ సమస్య కి గురి అవుతారు అని చెప్పారు. దీనిని సీరియస్ గా తీసుకోవాలని అన్నారు. ఈ రోజుల్లో నాణ్యత తగ్గిపోతోంది మరియు మరిన్ని కారణాల వల్ల చెముడు వస్తుంది అని అన్నారు.
అలాగే ఇది రావడానికి గల కారణం మిడిల్ ఇయర్ మరియు ఇన్నర్ ఇయర్ లో ఎఫెక్ట్ వల్లే అని అన్నారు లేదా వయసు ప్రభావం వల్ల కూడా ఇది దారితీస్తుంది అని చెప్పారు. 60 శాతం పిల్లల్లో వచ్చే వినికిడి సమస్యల్ని కంట్రోల్ చేయవచ్చు అయితే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే వీటిని అదుపు చేయవచ్చు. చెవులు శుభ్రం గా ఉంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఇయర్ వాక్స్ వల్ల చాలా కామన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇండియా లో 63 మిలియన్ల మందికి హియరింగ్ లాస్ ఉంది. నాసల్ ఎలర్జీ కి మరియు జలుబు వల్ల కూడా మిడిల్ ఎఆర్ ఎఫెక్ట్ అవుతుంది రిపోర్టు ప్రకారం చెవుడు పెరిగిపోతోంది అన్ని దేశాలలో కూడా రాను రాను మరెంత పెరిగిపోవచ్చు అని అన్నారు.