వైద్యవిభాగంలో నోబెల్ గెలుచుకున్న ఆ ముగ్గురు..

-

అమెరికాకి చెందిన హార్వే జే ఆల్టర్, చార్లెస్ ఎమ్ రైస్ ఇంకా బ్రిటన్ కి చెందిన మైఖేల్ హాటన్.. ముగ్గురూ నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. హెపటైటిస్ స్ వైరస్ కనుక్కున్నందున వైద్య విభాగంలో ఈ ముగ్గురికి నోబెల్ బహుమరి వరించింది. ఈ మేరకు నోబెల్ హెడ్ స్టాక్ హోం వేదికగా ప్రపంచానికి ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 70 మిలియన్ల హైపటైటిస్ కేసులు నమోదయ్యాయి. దీని కారణంగా ప్రతీ ఏటా 4లక్షల మందికి పైగా మరణిస్తున్నారు.

ఈ దీర్ఘకాల వ్యాధి కాలేయం పైన ప్రభావం చూపడంతో పాటు క్యాన్సర్ కి కారణమవుతుంది. స్వీడన్ కి చెందిన ఆల్ఫ్రెడ్ నోబెల్ సృష్టించిన ఈ నోబెల్ బహుమతికి ప్రస్తుతం స్వీడన్ కరెన్సీ లో 10లక్షలు బహుబతిగా ఇస్తున్నారు. కరోనా వైరస్ పై పోరాడుతున్న టైమ్ లో వైద్య విభాగంలో నోబెల్ బహుమతి గెలుచుకోవడం ఆసక్తి కలిగించే విషయం.

Read more RELATED
Recommended to you

Latest news