చైనా అణు సబ్​మెరైన్​కు ఘోర ప్రమాదం.. 55 మంది దుర్మరణం.. అయినా డ్రాగన్ గప్​చుప్​

-

చైనాలో ఘోరం జరిగింది. డ్రాగన్ దేశానికి సమీపంలోని ఎల్లో సముద్ర జలాల్లో భారీ అణు ప్రమాదం చోటుచేసుకొంది. చైనాకు చెందిన ఓ అణు సబ్‌మెరైన్‌ సముద్రపు ఉచ్చులో చిక్కుకుపోయింది. ఈ ఘటనలో దాదాపు 55 మంది సబ్​మెరైనర్లు దుర్మరణం చెందారు. కానీ ఈ విషయాన్ని చైనా ప్రపంచం నుంచి దాచిపెట్టింది. ఇప్పటికీ ఈ విషయంపై నోరు మెదపలేదు. దీంతో అణు లీకులు ఏమైనా జరిగాయా అనే సందేహం ప్రపంచ దేశాల్లో మొదలైంది. అయితే బ్రిటీష్ మీడియా ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకువచ్చింది. దానికి సంబంధించిన కథనాలను ప్రచురించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆగస్టు 21వ తేదీన చైనాకు చెందిన అణుశక్తి సబ్​మెరైన్ ‘093-417’ ఎల్లో సముద్ర జలాల్లో ఏర్పాటు చేసిన ఓ ఉచ్చులో చిక్కుకుంది. ఈ ఘటనలో అందులో ఉన్న 55 మంది సబ్​మెరైనర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన జరిగిన నెల దాటి వస్తున్నా చైనా ఈ విషయం గురించి నోరు మెదపలేదు. ఆగస్టులోనే అమెరికా నౌకాదళ నిపుణులు ఈ సబ్‌మెరైన్‌ ప్రమాదం గురించి చెప్పగా.. అప్పట్లో తైవాన్‌, చైనా రెండూ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చాయని తాజాగా బ్రిటన్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాల రిపోర్టుల ఆధారంగా ‘డైలీ మెయిల్‌’ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. తాజాగా బ్రిటన్‌ సబ్‌మెరైనర్లు కూడా ఈ ప్రమాదం విషయాన్ని ధ్రువీకరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version