అమెరికా ల్యాండర్ ప్రయోగం విఫలం

-

దాదాపు 50 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి చంద్రుడిపై ఒక ల్యాండర్‌ పంపాలని చేసిన ప్రయోగం దాదాపుగా విఫలమైంది. ఇంధనం లీకేజీ కారణంగా పెరిగ్రిన్‌ వ్యోమనౌకను చంద్రుడిపై దింపాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని విరమించుకున్నట్టు ఈ మిషన్ ను అభివృద్ధి చేసిన ప్రైవేటు కంపెనీ ఆస్ట్రోబోటిక్‌ టెక్నాలజీ ప్రకటించింది. బ్యాటరీల సమస్యను పరిష్కరించినా ప్రొపెల్లెంట్‌ కోల్పోవడం వల్ల తలెత్తిన అసలు సమస్యను పరిష్కరించలేకపోయినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు అవకాశం లేకపోవడం వల్ల విరమించుకున్నట్లు సంస్థ తెలిపింది.

ప్రస్తుతం ల్యాండర్‌ను అంతరిక్షంలో సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు ఆపరేట్ చేయడమే తమ ముందున్న కొత్త లక్ష్యం. వాహకనౌక సూర్యుడి దిశగా ఉంది. బ్యాటరీ కూడా ఫుల్‌గా ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 40 గంటల కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉంది.  సోమవారం వుల్కన్‌ రాకెట్‌ ద్వారా ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ స్పేస్‌ ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి పెరిగ్రిన్‌ను నింగిలోకి ప్రయోగించాం. 7 గంటల తర్వాత ఈ వ్యోమనౌకలో ఇబ్బంది తలెత్తింది. ఈ సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల వ్యోమనౌకను చంద్రుడిపై దింపాలన్న లక్ష్యాన్ని విరమించుకున్నాం. అని ఆస్ట్రోబోటిక్‌ టెక్నాలజీ సంస్థ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news