భారతీయుల గుండెల మీద తన్నిన ట్రంప్…?

-

అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశ ప్రజలను తన వైపుకి తిప్పుకోవడానికి వారిలో జాతీయ భావం పెంచడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు. అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదాన్ని ఆ దేశ ప్రజల్లో బాగానే తీసుకెళ్ళారు ట్రంప్. ఇక అక్కడి నుంచి మెక్సికో గోడ సహా కొన్ని కొన్ని నిర్ణయాలు ఆయన తీసుకోవడం అప్పుడు సంచలనంగా మారింది.

ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ట్రంప్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇమ్మిగ్రేషన్ ని తాత్కాలికంగా నిలిపి వేస్తూ ఆయన ఆదేశాలు ఇచ్చారు. దాని మీద సంతకం కూడా చేసారు. ఇక అమెరికన్ల ఉద్యోగాలను కాపాడుకోవడానికి గానూ మరో నిర్ణయం తీసుకున్నారు. హెచ్ 1 బీ వీసాల మీద తాత్కాలిక నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తున్నారు.

కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అందులో విదేశీయుల కంటే అమెరికన్లు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు తీసేసిన అమెరికన్ల స్థానంలో తక్కువ ధరకు వచ్చే ఇతర దేశాల వారిని తీసుకునే అవకాశం ఉంది. దీనితో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా పూర్తి స్థాయిలో రీ ఓపెన్ అయిన తర్వాత ఉద్యోగాల కోసం అమెరికన్లు మాత్రమే ఉండాలని భావించిన ట్రంప్… హెచ్ 1 బీ వీసాలను నిలిపివేసే నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news