రష్యాను విడిచి వెంటనే వెళ్లిపోండి.. తమ పౌరులకు అమెరికా హెచ్చరిక

-

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి ఏడాది సమీపిస్తున్న వేళ అగ్రరాజ్యం ఓ కీలక ప్రకటన చేసింది. రష్యాలో ఉంటే రక్షించలేమని.. వెంటనే ఆ దేశం విడిచి వేరే చోటికి వెళ్లాలని తమ పౌరులకు అమెరికా సూచించింది. ఉక్రెయిన్‌లో తీవ్రతరమవుతోన్న దాడులతోపాటు రష్యా భద్రతాసంస్థల నుంచి ఏకపక్ష అరెస్టులు, వేధింపుల ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.

‘‘రష్యాలో నివసిస్తున్న లేదా పర్యటిస్తోన్న అమెరికా జాతీయులు వెంటనే దేశాన్ని వీడి బయలుదేరాలి’ అని మాస్కోలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. మాస్కోకు దూరంగా ఉన్న పౌరుల భద్రతను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో  పర్యవేక్షించలేమని, ఏదైనా ముప్పు ఎదురైనా రక్షించలేమని పేర్కొంది. తప్పుడు నిర్బంధాల అవకాశం నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. దీంతోపాటు అమెరికన్లను రష్యాకు వెళ్లొద్దని పేర్కొంది. గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే అనుమానంతో అమెరికా పౌరుడిపై క్రిమినల్‌ కేసు ప్రారంభించినట్లు రష్యాకు చెందిన ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ ఇటీవల తెలిపిన వేళ తాజా ప్రకటన వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news