చైనాలో ప్రాణాంత‌క ఆంత్రాక్స్ న్యుమోనియా గుర్తింపు.. పేషెంట్ కు చికిత్స‌..

-

క‌రోనా మ‌హ‌మ్మారి ఇంకా పూర్తిగా అంతం కాలేదు, అప్పుడే కొత్త కొత్త వ్యాధులు వ‌స్తూ ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నాయి. కొన్ని వ్యాధులు గ‌తంలో అంత‌మైనా ఇప్పుడు మ‌ళ్లీ అవి వ్యాప్తి చెందుతూ భ‌య‌పెడుతున్నాయి. ఇక తాజాగా చైనాలో ప్రాణాంత‌క‌మైన ఆంత్రాక్స్ న్యుమోనియా కేసు ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది.

చైనాలోని హెబెయ్ ప్రావిన్స్ షెంగ్డె అనే ప్రాంతానికి చెందిన ఓ వ్య‌క్తికి ఇటీవ‌ల ఆంత్రాక్స్ న్యుమోనియా సోకింది. దీంతో అత‌న్ని హాస్పిట‌ల్‌కు త‌రలించి 4 రోజుల పాటు ప్ర‌త్యేక ప‌ర్యవేక్ష‌ణ‌లో ఉంచి చికిత్స అందించారు. త‌రువాత అత‌న్ని విడిగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆ వ్య‌క్తి త‌న గొర్రెలు, ప‌శువుల ఫామ్‌లో ప‌నిచేస్తాడు. వాటి ద్వారానే అత‌నికి ఈ వ్యాధి వ‌చ్చిన‌ట్లు గుర్తించారు.

ఆంత్రాక్స్ న్యుమోనియా అనేది ప‌శువుల నుంచి మ‌నుషుల‌కు వ‌స్తుంది. అవి ఉన్న ప్ర‌దేశంలో వాటి నుంచి వ‌చ్చే ధూళి క‌ణాల్లో ఆంత్రాక్స్ క్రిములు ఉంటాయి. ఈ క్ర‌మంలో వాటిని వాస‌న పీల్చితే ఆంత్రాక్స్ మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. ఆంత్రాక్స్ బారిన ప‌డితే చ‌ర్మంపై ద‌ద్దుర్లు, బొబ్బ‌లు వ‌స్తాయి. అయితే ఆంత్రాక్స్ ఉన్న ప‌శువుల మాంసం తింటే సూక్ష్మ క్రిములు పేగుల్లో ప్ర‌వేశించి ఇంటెస్టైన‌ల్ ఆంత్రాక్స్‌ను క‌ల‌గ‌జేస్తాయి. దీంతో బాధితుల్లో వికారం, వాంతులు, విరేచ‌నాలు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

అయితే ఆంత్రాక్స్ అనేది మ‌నుషుల నుంచి మ‌నుషుల‌కు వ్యాప్తి చెందుతుంది. కానీ కోవిడ్‌లా వేగంగా వ్యాప్తి చెంద‌దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version