వైఎస్ వివేకా హత్య కేసు : విచారణ ఆపేసిన సిబిఐ!

-

కడప జిల్లా : మాజీ మంత్రి వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల అన్వేషణ కు బ్రేక్ పడింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకూ త్రవ్వకాలు నిలిపివేయాలంటూ మున్సిపల్ సిబ్బంది కి సీబీఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రోటరీపురం, గరండాల వాగు వద్ద త్రవ్వకాలు నిలిపి వేశారు. అలాగే…బారికేడ్లు తొలగించి పోలీసుల పికేటింగ్ ఎత్తివేశారు.

ఆ రహాదారి గుండా యధావిధిగా ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చారు అధికారులు. మూడు రోజుల పాటు త్రవ్వకాలు చేసినా ఆయుధాలు లభించకపోవడంతో సిబిఐ ఈ నిర్ణయం తీసుకుంది.

రెండు రోజులుగా మున్సిపల్ సిబ్బంది తీవ్రంగా శ్రమించినా ఆయుధాల జాడ దొరకలేదు. దీంతో ఆయుధాల అన్వేషణకు బ్రేక్ వేసింది సి.బి.ఐ. కాగా పులివెందుల కేంద్రంగా విచారణ సాగిస్తున్న సీబీఐ అధికారులు..మరోమారు పలువురు అనుమానితులను విచారించే అవకాశం ఉంది. కస్టడిలో ఉన్న సునీల్ ఇచ్చిన ఆయుధాల సమాచారంతో సందిగ్ధంలో పడ్డారు సీబీఐ అధికారులు.ఈ నేపథ్యంలోనే మరోమారు ఆయుదాల సమాచారంపై విచారించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version