బ్రిటన్ రాణి ఎలిజబెత్ ను హత్య చేయడానికి ఒక యువకుడు ప్రయత్నించాడు. దీంతో ఆ యువకున్ని స్కాట్లాండ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే బ్రిటన్ రాణి ఎలిజబెత్ ను ఎందుకు చంపాలనుకున్నాడో అతను చెప్పన కారణం చూసి పోలీసులు అశ్చర్య పోయారు. రాణి ఎలిజబెత్ ను హత్య చేయడానికి ప్రయత్నంచే కొంత సమయం ముందు ఈ యువకుడు తన స్నాప్ చాట్ లో ఒక వీడియోను పోస్టు చేశాడు. ఆ వీడియోలో.. తన పేరు జస్వంత్ సింగ్ ఛాయల్ (19) అని చెప్పాడు.
తనది భారతీయ సిక్కు అని చెప్పాడు. తను బ్రిటన్ రాణి ఎలిజబెత్ ను చంపడానికే వచ్చానని అన్నాడు. 1919 లో జరిగిన జలియన్ వాలా బాగ్ ఘటనకు ప్రతీ కారంగా రాణి ఎలిజబెత్ ను చంపుతానని అన్నాడు. అయితే క్రిస్మస్ వేడుకల కోసం విండర్స్ క్యాజిల్ రాజ ప్రాసాదానికి రాణి ఎలిజబెత్ వెళ్లారు. అక్కడికే జస్వంత్ సింగ్ ఒక విల్లు ను పట్టుకుని వెళ్లాడు. రాణి ఎలిజబెత్ నివాసానికి ఆ యువకుడు వెళ్తున్న క్రమంలో పోలీసులు అరెస్టు చేశారు. కాగ ఆ యువకుని మానసిక పరిస్థితి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ యువకున్ని ప్రస్తుతం మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.