ఆఫర్.. వ్యాక్సిన్ వేసుకంటే బీర్ ఫ్రీ.. ఎక్క‌డో తెలుసా?

ప్ర‌స్తుతం కొవిడ్ ప్రంప‌చాన్ని ఎంత‌లా అతాల‌కుత‌లం చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇక దీనికి చెక్ పెట్టాలంటే ఒకే ఒక మార్గం వ్యాక్సిన్‌. కానీ వ్యాక్సిన్‌పై ప్ర‌జ‌ల‌కు ఎన్నో అనుమానాలు ఉండ‌టంతో చాలామంది వేసుకోవ‌డానికి ముందుకు రావ‌ట్లేదు. ఇక అమెరికా లాంటి దేశాల్లో అయితే యూత్ దీనిపై పెద్ద‌గా ఇంట్రెస్ట్ చూప‌ట్లేదు.

దీంతో చాలా అమెరికాలోని చాలా రాష్ట్రాలు కొత్త ప్లాన్లు వేస్తున్నాయి. ఇప్పుడు అక్క‌డ 18ఏళ్ల పైబ‌డిని వారికి వ్యాక్సినేష‌న్ కొన‌సాగుతోంది. దీంతో వారికి వ్యాక్సిన్ వేసేందుకు రకరకాల ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే డ్రింక్స్ తయారు చేసే అన్ హైజర్ అనే సంస్థ.. 21 ఏళ్లు పైబడిన యువతను దృష్టిలో ఉంచుకొని కొత్త ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి తమ వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకునే మొద‌టి 2 లక్షల మందికి ఒక్కొక్కరికి 5 డాలర్ల విలువైన బీర్ ను ఫ్రీగా ఇస్తామంటూ ప్ర‌క‌టించింది. దీంతో చాలామంది ఈ ఆఫ‌ర్ కోసం బుకింగ్స్ చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.