జీతం ఇవ్వడం లేదని.. ఉగాండాలో మంత్రిని కాల్చేసిన బాడీగార్డ్

-

సాధారణంగా జీతం ఇవ్వకపోతే ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తారు. మరీ కోపం వస్తే ఉద్యోగం మానేస్తారు. కానీ ఉగాండాలో మాత్రం ఓ వ్యక్తి కాస్త వైలెంట్ గా రియాక్ట్ అయ్యాడు. ఏకంగా జీతం ఇవ్వలేదని తన యజమానిని చంపేశాడు. అయితే ఆ యజమాని సాధారణ వ్యక్తి కాదు. ఏకంగా ఆయన ఆ దేశ మంత్రి. ఇంతకీ ఏం జరిగింది అంటే..?

death

ఉగాండా రాజధాని కంపాలాలో అంగరక్షకుడు జరిపిన కాల్పుల్లో ఆ దేశ కార్మిక శాఖ సహాయమంత్రి, రిటైర్డ్‌ కల్నల్‌ చార్లెస్‌ ఎంగోలా ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అంగరక్షకుడు సైతం కాల్చుకుని మృతి చెందాడు. మంత్రి ఎంగోలా నివాసంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్‌ వివాదమే కాల్పులకు దారితీసిందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే.. వేతనాల విషయంలో వివాదం నడుస్తోందని.. కొంత కాలంగా జీతం చెల్లించలేదనే కారణంతోనే మంత్రిని గార్డు కాల్చి చంపినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటన దురదృష్టకరమని. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు ఆర్మీ ప్రతినిధి ఫెలిక్స్‌ కులాయిగ్వే వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version