అమెరికాలో పొగపెడుతున్న కెనడా కార్చిచ్చు.. బయటకొస్తే అంతే..!

-

కెనడా దేశంలో చెలరేగిన కార్చిచ్చు అమెరికా ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది కెనడాలోని 400 చోట్ల అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు ఆ దేశం సహా అమెరికా తూర్పు రాష్ట్రాలపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. దట్టమైన పొగ చెలరేగి.. సరిహద్దు ప్రాంతాల ప్రజలను ప్రభావితం చేస్తోంది.

ఈ పొగ కారణంగా ఈ రెండు దేశాల్లో కోట్లాది ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆకాశంలో దట్టమైన పొగ అలముకుని రోజువారీ జీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్లకే పరిమితం కావాలని, మాస్కులు ధరించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. న్యూయార్క్‌ పట్టణంలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఇది ఏక్యూఐ 400కిపైగా నమోదవుతోందని తెలిపారు.

మరోవైపు, కెనడాలో 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దావాగ్నిని నియంత్రించటానికి కెనడా ఇతర దేశాల సాయాన్ని కోరుతోంది. అమెరికా సహా పలు దేశాలు కెనడాకు అగ్నిమాపక సిబ్బందిని, సామగ్రిని పంపుతున్నాయి. ఇప్పటికే 600 మంది అగ్నిమాపక సిబ్బందిని, సహాయ సామగ్రిని కెనడాకు అమెరికా పంపింది.

Read more RELATED
Recommended to you

Latest news