లెటెస్ట్ వర్షన్.. చైనా నుంచి నక్క చాలా నేర్చుకోవాలి.. !!

-

భారత్ –చైనా సరిహద్దుల మధ్య తాజాగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో ప్రపంచంలోని పలు దేశాలు ఇండియాకు మద్దతుగా నిలుస్తూ చైనాను ఏకాకిని చేశాయి. దీంతో చైనా తోకముడిచింది. కయ్యానికి కాలు దువ్వేందుకు రెడీ అయిన చైనా ఆ కాలు వెనక్కి నెట్టుకొని సైలెంట్ గా దువ్వను దువ్వలేదు.. అస్సలు ఆ ప్రయత్నమే చేయలేదు అన్నట్లు ముడిచుకుంది.

 

అయితే గాల్వాన్ లోయ ఘటన తర్వాత ఇండియా యుద్ధానికి సిద్ధమైంది. తాము శాంతిని కోరుకుంటామని… కానీ అదే సమయంలో తమకు నష్టం కలిగితే చేతులు ముడుచుకొని కూర్చోమని ధీటుగా బదులిచ్చింది. సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా సైనికులను మోహరిస్తూనే చైనాను ఆర్ధికంగా దెబ్బకొట్టేందుకు ఆ దేశానికీ చెందిన 59 యాప్స్ పై నిషేధాన్ని విధించింది. ఆ తర్వాత ప్రధాని మోడీ లడఖ్ లో పర్యటించిన సమయంలో చైనా పేరు ప్రస్తావించకుండానే చైనా అంతర్గతంగా జరుపుతున్న దురాగతంపై విమర్శలు గుప్పించారు. దీంతో చైనా షాక్ కి గురైంది.

అదేవిధంగా అగ్రరాజ్యం అమెరికా కూడా చైనాను విమర్శిస్తూ, ఇండియాకు మద్దతుగా నిలిచింది. ఇండియాకు అనుకూలంగా బలగాలను దించుతామని తీవ్రంగా హెచ్చరించింది. చైనా చేసిన తప్పుల వలన ప్రపంచం మొత్తం కరోనా బారిన పడి లక్షల మంది మృత్యువాత పడుతున్నారని వెల్లడించింది. అలాగే… చైనాపై దాదాపు ఆ చుట్టూతా ఉన్న దేశాలన్నీ విమర్శిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో దాని నుంచి ప్రపంచం దృష్టిని మరల్చేందుకు చైనా తన బలాన్ని చాటేందుకు గాల్వాన్ లోయ ఉదంతాన్ని కావాలని క్రియేట్ చేసింది.

కాగా అదే సమయంలో ఎంతో మెలకువతో ఉన్న ఇండియా వ్యూహాత్మకంగా దెబ్బకొట్టడంతో చైనా కాళ్ల బేరానికి రాక తప్పలేదు. ఇండియా తమకు శత్రుదేశం కాదని, శాశ్వత మిత్ర దేశం అని ఇండియాలోని చైనా రాయభారి సన్ విడాంగ్ తెలిపారు. తాము ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని, ఇండియా.. చైనా మధ్య సంబంధాలు తిరిగి గాడిన పెట్టడానికి చర్చలు జరుపుతున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని సన్ విడాంగ్ వివరించడంతో చైనా దెబ్బకు దిగొచ్చిందని ఇండియా కాలర్ ఎగరేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news