ప్రపంచంలోనే వృద్ధ దేశంగా చైనా.. భారీగా తగ్గిన జననాలు

-

ప్రపంచంలోనే వృద్ధ దేశంగా చైనా అవతరించింది. డ్రాగన్ దేశంలో జననాల రేటు రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గతేడాది కేవలం 95.6 లక్షల మంది చిన్నారులు జన్మించినట్లు నేషనల్ హెల్త్ కమిషన్‌ ప్రచురించిన తాజా నివేదిక తెలిపింది. ఆ దేశంలో 1949 నుంచి నమోదవుతున్న రికార్డుల్లో అత్యల్ప జననాలు సంభవించిన ఏడాదిగా రికార్డు నమోదైనట్లు వెల్లడించింది.

కొత్తగా పెళ్లయిన మెజారిటీ జంటలు కేవలం ఒకరిని కంటే చాలనే నిర్ణయానికి రావడం.. మరికొందరు అసలు పిల్లలే వద్దని అనుకోవడం వల్ల గతేడాది చైనా జనాభా 1.41 బిలియన్ల వద్దే ఆగిపోయింది. వృద్ధ జనాభా పెరగడం వల్ల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేయాల్సి వచ్చి.. ఆదాయం తగ్గిపోతోంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదముందని చైనా ఆధికారుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

‘ఒకే బిడ్డ విధానం’తో చైనాలో జనాభా సమస్య మొదలైంది. 1980 నుంచి 2015 దాకా ఆ దేశంలో పెళ్లయిన జంటలు ఒక బిడ్డకు మాత్రమే జన్మనివ్వాలనే నిబంధనను అమలు చేసిన డ్రాగన్ సర్కార్.. జనాభా అసమతుల్యత ప్రభావం గురించి తెలియగానే ఆ విధానానికి స్వస్తి పలికింది. జనాభా రేటును పెంచేందుకు చైనా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినా.. ప్రస్తుతానికైతే పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు

Read more RELATED
Recommended to you

Latest news