రేపు అంతరిక్షంలోకి పౌర వ్యోమగామిని పంపనున్న చైనా

-

అంతరిక్షంలోకి పౌర వ్యోమగామిని పంపేందుకు చైనా రంగం సిద్ధం చేసింది. టియాంగాంగ్‌ స్పేస్‌స్టేషన్‌ మిషన్‌లో భాగంగా ఈ యాత్ర జరగనున్నట్లు చైనా మ్యాన్డ్‌ స్పేస్‌ ఏజెన్సీ పేర్కొంది. బీజింగ్‌ విశ్వవిద్యాలయంలో ఏరోనాటిక్స్‌ అండ్‌ ఆస్ట్రోనాటిక్స్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసే పేలోడ్‌ నిపుణుడు గుయ్‌ హైచావ్‌ను పంపేందుకు ఏర్పాట్లు చేసింది.

ఇప్పటి వరకు చైనా అంతరిక్షంలోకి పంపిన వారు మొత్తం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన వ్యోమగాములే. గుయ్‌.. నాన్‌ ఆర్బిట్‌ స్పేస్‌ ఆపరేషన్స్‌కు బాధ్యత వహిస్తారు. ఈ మిషన్‌ వాయువ్య చైనాలోని జ్యూకాన్‌ శాటిలైట్‌ లాంఛ్‌ సెంటర్‌ నుంచి మంగళవారం ఉదయం 9.31 గంటలకు ప్రారంభం కానుందని  స్సేస్‌ ఏజెన్సీ వెల్లడించింది.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ప్రణాళిక అయిన ‘స్పేస్‌ డ్రీమ్‌’ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఈ యాత్ర జరుగుతోంది. ఇప్పటికే సైనిక అంతరిక్ష కార్యక్రమంలో డ్రాగన్‌ బిలియన్ల కొద్దీ డాలర్లను పెట్టుబడి పెట్టింది. భవిష్యత్తులో చంద్రుడిపైకి మనుషులను తరలించడమే దీని లక్ష్యం.

Read more RELATED
Recommended to you

Latest news