కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ పర్యటన ఫిక్స్ అయింది. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల మణిపూర్ పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. నేటి నుంచి జూన్ 1 వరకు మణిపూర్ లో పర్యటించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మణిపూర్ సమస్యలపై చర్చించనున్నారు.
ఇక ఈ రోజు సాయంత్రం ఇంఫాల్ చేరుకోనున్న అమిత్ షా… మణిపూర్ లో పరిస్థితులు తెలుసుకోవడం, సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరపనున్నారు. అలాగే, పలు దఫాలుగా భద్రతా సమావేశాలను నిర్వహించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక బిల్లు కారణంగా మణిపూర్ రాష్ట్రము అంతటా హింసాత్మక పరిస్థితులతో దాదాపుగా నెల రోజుల నుండి అట్టుడుకుతోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అన్నీ మెల్ల మెల్లగా సర్దుమణుగుతున్నాయి. ఈ తరుణంలోనే అమిత్ షా అక్కడికి వెళ్లనున్నారు.