డబ్ల్యుహెచ్ఓకి చైనా షాక్… నిజాలు దాస్తుందా…?

కరోనా వైరస్ మూలాన్ని పరిశోధించాల్సిన బృందం రావడానికి అనుమతులను ఖరారు చేయకపోవడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరాశ వ్యక్తం చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మంగళవారం పేర్కొన్నారు. గత 24 గంటలలో, కరోనా వైరస్ మూలాలపై అంతర్జాతీయ శాస్త్రీయ బృందం సభ్యులు తమ స్వదేశాల నుండి చైనాకు ప్రయాణించడం ప్రారంభించారు అని…

చైనాకు తమ టీం రావడానికి అవసరమైన అనుమతులను చైనా అధికారులు ఇంకా ఖరారు చేయలేదని ఈ రోజు తమకు తెలిసిందని ఆయన అన్నారు. చైనా ప్రభుత్వం ఊహాన్ వెళ్ళడానికి అంగీకరించే ఉద్దేశంలో లేదని అన్నారు. ఇద్దరు సభ్యులు తమ ప్రయాణాలను ఇప్పటికే ప్రారంభించారని ఆయన అన్నారు. ఇతరులు చివరి నిమిషంలో ప్రయాణించలేకపోయారనే వార్తతో నేను చాలా నిరాశపడ్డాను అని ఆవేదన వ్యక్తం చేసారు.

కానీ నేను చైనా సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరిపాను అని పేర్కొన్నారు. ఇది తమకు కీలకమైన పర్యటన అని తాను చెప్పా అని ఆయన వెల్లడించారు. వీలైనంత త్వరగా మిషన్ జరగడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసక్తిగా ఉందని టెడ్రోస్ చెప్పారు. చైనా అనుమతించకపోవడంతో ఇప్పుడు అమెరికా సహా యూరప్ దేశాలు సీరియస్ గా ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదని, దీని ద్వారా చైనా నిజాలు దాస్తుంది అనే విషయం తమకు స్పష్టంగా అర్ధమవుతుందని అమెరికా విమర్శించింది.