పాకిస్థాన్ కి చైనా స్ట్రాంగ్ వార్నింగ్.. 30 వేల కోట్లు చెల్లించకుంటే..

-

పాకిస్తాన్ కు చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. తమకు చెల్లించాల్సిన 30 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని పలు చైనా కంపెనీలు పాక్ ను డిమాండ్ చేశాయి. చెల్లించకుంటే పాకిస్థాన్ లోని తమ కంపెనీలను మూసివేస్తామని హెచ్చరించాయి. పాకిస్తాన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ మంత్రి ఆసాన్ ఇక్బాల్ తో సమావేశం అనంతరం చైనీస్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్(IPPS) ఈ వార్నింగ్ ఇచ్చినట్లు డాన్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. చైనా- పాక్ ఎకానమిక్ కారీడర్ (సీపెక్)లో భాగంగా 30 చైనా కంపెనీలు పాకిస్తాన్ లో విద్యుత్ కమ్యూనికేషన్లు, రహదారులు, రైల్వేలకు సంబంధించిన, ఇతర సేవలను అందిస్తున్నాయి.

అయితే వీటికి సంబంధించిన 30 వేల కోట్ల రూపాయలు సదరు కంపెనీలకు పాకిస్థాన్ ప్రభుత్వం బాకీ పడింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆసాన్ ఇగ్బాల్ తో చైనీస్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమకు చెల్లించాల్సిన బకాయిలను గురించి 25 కంపెనీల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చాయి. ఆ బకాయిలను తక్షణమే చెల్లించాలని లేదంటే తమ కంపెనీలను తక్షణమే మూసివేస్తామని హెచ్చరించారు. అయితే ఈ అంశం పై పాక్ ప్రధాని దృష్టి సారించారని, నెల రోజుల్లోగా బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని సదరు కంపెనీల ప్రతినిధులకు మంత్రి హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news