ఫ్రాన్స్​ అధ్యక్ష భవనానికి ‘తెగిన వేలు’ పార్శిల్

-

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ అధికారిక నివాసం ఎలిసీ ప్యాలెస్‌లో తెగిన వేలుతో ఉన్న ఓ పార్శిల్ కలకలం రేపింది. ఈ వారం మొదట్లో ఈ పార్శిల్​ను గుర్తించినట్లు తెలిసింది. ఈ ఘటనను పారిస్‌ ప్రాసిక్యూటర్‌ అధికారి తాజాగా ధ్రువీకరించినట్లు ఫ్రెంచ్‌ మీడియా కథనాలు వెల్లడించాయి.

దీనిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ వేలు.. ప్యాకేజీని పంపించిన వ్యక్తిదే అయి ఉంటుందని ప్రాసిక్యూటర్‌ అధికారి అనుమానిస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. అతడి మానసిక స్థితి సరిగా లేకపోయి ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై ఎలిసీ ప్యాలెస్‌ నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.

గత నెల పోలీసుల కాల్పుల్లో ఓ 17 ఏళ్ల యువకుడు మృతి చెందడటంతో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వేలాది మంది ఆందోళనకారులు కొన్ని వారాల పాటు రోడ్లపై చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లు జరిగిన కొద్ది రోజులకే అధ్యక్ష భవనానికి ఇలా తెగిన వేలితో బెదిరింపులు రావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news