కలిసొచ్చిన టమోటా పంట.. కోటీశ్వరుడైన రైతు..!

-

పెరిగిన టమోటా ధరలతో అటు సామాన్యులు కొనలేకపోతున్నారు. మరోపక్క రోజు ఈ టమోటాలపై ఏదో ఒక ఇంట్రస్టింగ్‌ స్టోరీ వెలుగులోకి వస్తుంది. పచ్చనికాపురంలో చిచ్చుపెట్టిన టమోటా అంటూ మొన్న ఒక వార్త తెగ వైరల్‌ అయింది. అలాగే భార్య పుట్టినరోజుకు టమోటాలను గిఫ్ట్‌గా ఇచ్చాడు ఓ భర్త. ఇది ఇలా ఉంటే.. టమోటా పంట వేసిన రైతులు మాత్రం కాసులు దండుకుంటున్నారు. ఒక్కరోజులో 38 లక్షలు సంపాదించింది ఓ టమోటా రైతు కుటుంబం. అప్పుడే అది పెద్ద విషయం అనుకున్నాం.. ఇప్పుడు ఇంకో రైతు ఏకంగా టమోటాలు అమ్మి కోటీశ్వరుడు అయ్యాడు.

పూణెలోని జున్నార్‌కు చెందిన ఓ రైతు టమాట సాగు చేసి కోటీశ్వరుడు అయ్యాడు. పచ్ఘర్ పూణే, నగర్ జిల్లా సరిహద్దులో ఉన్న ఒక చిన్న గ్రామం. జున్నార్‌ను గ్రీన్ బెల్ట్ అని అంటారు. రాష్ట్రంలోని చాలా ఆనకట్టలు ఈ తాలూకాలోనే ఉన్నాయి. దీంతో గ్రామమే మారిపోయింది. ఏడాది పొడవునా నల్ల నేల, నీటి కారణంగా ఉల్లి, టమోటా ఇక్కడ సాగు చేస్తారు.

ఆ పల్లెల్లో టమోటా సాగు విరివిగా చేస్తారు. దీంతో టమాట సాగు వల్ల చాలా మంది అదృష్టమే మారిపోయింది. అందులో గయ్కర్ కుటుంబం ఒకటి. పచ్‌ఘర్‌కు చెందిన తుకారాం భాగోజీ గయ్కర్‌కు 18 ఎకరాల హార్టికల్చర్ భూమి ఉంది. ఇందులో కొడుకు ఈశ్వర్ గయ్కర్, కోడలు సోనాలి సహకారంతో 12 ఎకరాల్లో టమాట సాగు చేశాడు.

ఇదొక్కటే కాదు గైకర్ టమోటా సాగుతో 100 మందికి పైగా మహిళలకు ఉపాధి లభించింది. అతని కోడలు సోనాలి గైకర్ టమోటా తోట సాగు, పంట కోత, డబ్బాలు నింపడం, పిచికారీ చేయడం మొదలైన వాటిని నిర్వహిస్తోంది. కాగా కుమారుడు ఈశ్వర్ గైకర్ సేల్స్ మేనేజ్ మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నారు. గత 3 నెలల కష్టానికి మంచి మార్కెట్ రావడంతో ఫలించింది.

తుకారాం భాగోజీ గయ్కర్‌కు ఈ ఏడాది టమాటా పంట లాటరీ తగిలినట్లు తగిలింది. ఇటీవల, జూలై 11, 2023న టొమాటో క్రేట్ ధర రూ.2100 (20 కిలోల క్రేట్). గైకర్ మొత్తం 900 టమోటా డబ్బాలను విక్రయించాడు. ఒక్కరోజులోనే రూ.18 లక్షలు సంపాదించాడు. గతంలో గ్రేడ్‌ను బట్టి ఒక్కో క్రేట్‌కు రూ.1000 నుంచి రూ.2400 వరకు ధరలు లభించాయి. దీంతో కోటీశ్వరుడయ్యాడు.

గైకర్‌ ఒక్కడే కాదు.. ఆ తాలుకాలో 12 మంది వరకూ రైతులు టమోటా సాగుతో లక్షాధికారులుగా మారారు. మార్కెట్ కమిటీ టర్నోవర్ నెల రోజుల్లో రూ.80 కోట్ల వరకు ఉంది. ఈ ఏడాది టమోటా పంట రైతుల అప్పులన్నీ తీర్చేసింది. లక్కు ఎప్పుడో ఒకసారి తగులుతుంది.. ఏళ్ల నాటు బాకీలు కూడా ఎగిరిపోతాయ్ అంటారు కదా.. అది ఇదేనమో.. రైతులు ఇలాంటి నమ్మకంతోనే.. అప్పులపాలైనా ఈ ఏడు అయినా అదృష్టం కలిసి వస్తుందనే నమ్మకంతో వ్యవసాయాన్ని వదిలిపెట్టకుండా చేస్తూనే ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news