క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులతో సంయుక్త సమావేశానికి ముందు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ఈ రోజు అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీతో సమావేశమయ్యారు. ఈ రోజు జపాన్ టోక్యోలో ఆయన ఈ భేటీ నిర్వహించారు. రెండు రోజుల పర్యటనకు ఆయన వెళ్ళారు. ఇండో- పసిఫిక్‌లో స్థిరత్వం మరియు శ్రేయస్సు కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని జై శంకర్ అన్నారు.
రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యల గురించి చర్చించారు. అంతే కాకుండా కరోనా వ్యాక్సిన్ తయారికి ఇండియా సహకారం చాలా అవసరం అని అమెరికా కోరినట్టుగా తెలుస్తుంది. ఎక్కువ మోతాదులు ఇండియా మాత్రమే తయారు చేయగలదు అని చెప్పారు. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా మరియు జపాన్ విదేశాంగ మంత్రుల సమావేశం కరోనా మహమ్మారి మధ్య అధిక ప్రాముఖ్యత సంతరించుకుంది.