ఏపీలో లిక్కర్ సేల్స్ భారీగా పడిపోయింది. దీంతో రెవెన్యూ గతేడాది కంటే ఈ ఏడాది భారీగా తగ్గింది. మద్యం అమ్మకాలు, ఆదాయం సుమారు 25 శాతం మేర పడిపొయ్యాయి. గతేడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యన మద్యం, బీర్ల అమ్మకాల ద్వారా రూ. 10,282 కోట్ల ఆదాయం వస్తే ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య రూ. 7,706 కోట్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి.
64 శాతం మేర మద్యం విక్రయాలు పడిపోవడానికి ధరల పెంపుతో పాటు కరోనా ఎఫెక్టు కూడా కారణంగా తెలుస్తుంది.బీర్ల అమ్మకాల్లో 89శాతం పడిపొయ్యాయి. 2019-2020లో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 159.35 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది కేవలం 16.82 లక్షల కేసుల బీర్ల అమ్మకం మాత్రమే జరిగింది. గతేడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 166 లక్షల కేసుల మద్యం అమ్మకం జరుగగా ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కేవలం 65.62 లక్షల కేసుల మద్యం మాత్రమే సేల్ అయింది.