ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు హ్యాంగోవర్…!

-

ఫైజర్ తయారు చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ షాట్ ని అందుకున్న వాలంటీర్ లు మొదటి షాట్ తీసుకున్న తర్వాత తీవ్రమైన హ్యాంగోవర్ వచ్చినట్టు వెల్లడించారు. వారికి తలనొప్పి, జ్వరం మరియు కండరాల నొప్పులు వచ్చాయని, అవి కూడా తీవ్రంగా ఉన్నాయని వెల్లడించారు. పైజర్… జర్మన్ సంస్థ బయోఎంటెక్ తో ఈ వ్యాక్సిన్ ని తయారు చేస్తున్నారు. కరోనాకు ఈ టీకా 90 శాతం ప్రభావవంతంగా ఉందని ప్రకటించిన కొన్ని రోజుల తరువాత ఈ వార్తలు వచ్చాయి.

డైలీ మెయిల్ వెల్లడించిన నివేదిక ప్రకారం , క్లినికల్ ట్రయల్స్ కోసం ఆరు దేశాలలో 43,500 మందికి పైగా వాలంటీర్లను పరీక్షించారు. అనేకమంది వాలంటీర్లు ‘తీవ్రమైన హ్యాంగోవర్’ మరియు ‘తలనొప్పి’ వంటి దుష్ప్రభావాలను వెల్లడించారు. 44 ఏళ్ల గ్లెన్ దేశీల్డ్స్ అనే వాలంటీర్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాని ఆ లక్షణాలు త్వరగా పోయాయి ఆయన వెల్లడించారు. క్యారీ అనే మహిళ తాను తలనొప్పి, జ్వరం మరియు నొప్పులను అనుభవించా అన్నారు. రెండవ షాట్ తరువాత, ఇవి మరింత తీవ్రంగా మారాయి అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news