దీపావళి పర్వదినం ప్రత్యేక సందేశం: ఆస్ట్రేలియా ప్రధాని

-

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరియస్ దేశ ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పటిలా కాకుండా ఈసారి నిర్వహించుకునే వేడుకలు ప్రత్యేకమైనవని చెప్పుకొచ్చారు. ఈ పండగ విశిష్టత సూచించేట్లుగా ప్రస్తుతం యావత్తు ప్రపంచం చీకటి రోజుల నుంచి వెలుతురులోకి ప్రవేశిస్తోందని ఆయన గుర్తు చేశాడు.

Scott Moria
Scott Moria

అయితే ఆయన పరోక్షంగా కరోనా వ్యాప్తి, వ్యాక్సిన్ అభివృద్ధిని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం దేశ ప్రజలకు వీడియో ద్వారా సందేశం అందజేశారు. ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన దాదాపు 70 లక్షల మంది నివాసముంటున్నారు. ప్రతి ఏడాది ఆ దేశ పౌరసత్వం పొందుతున్న అత్యధిక మంది భారతీయులు కూడా ఉన్నారు. గతేడాదే 28వేల మంది భారతీయులు ఆస్ట్రేలియా పౌరులుగా సభ్యత్వం పొందారు.

ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మాట్లాడుతూ.. ‘‘దేశ ప్రజలకు దీపావళి పండగ శుభాకాంక్షలు. చీకటిని పారదోలే ఈ పండగ ప్రత్యేకత గురించి చాలా ఏళ్లుగా గుర్తు చేసుకుంటున్నాం. కానీ, ఎప్పుడూ ఈ పండగను అనుభవపూర్వకంగా జరుపుకోలేదు. అయితే ఈ సారి దీపావళి వేడుకలు ప్రత్యేకమైనవి. యావత్తు ప్రపంచం కరోనా మహమ్మారికి బలైంది. అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు జీవనోపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఆయా దేశాలు కలిసి కట్టుగా ఉంటూ అండగా నిలిచామన్నారు.

మహమ్మారిపై పోరాటం చేస్తూ ముందున్న కరోనా వారియర్స్ నుంచి ఎంతో స్ఫూర్తిని పొందాం. ఈ ఏడాది మొత్తం చీకటిలో జీవించాం. కానీ వెలుతురులో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మున్ముందు మరింత ప్రకాశవంతమైన రోజులున్నాయి.’’ అంటూ ప్రధాని మోరిసన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రతిపక్షనేత ఆంటోని అల్బనీస్ కూడా దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశాడు. కరోనాతో దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయని, దీపావళి వెలుతురుతో కరోనా మహమ్మారి పూర్తిగా నాశనం అవ్వాలని కోరుకుందామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news