ట్రంప్‌ నోటిదురుసు.. సీఎన్‌ఎన్‌ ఇంటర్వ్యూలో తిట్లపురాణం

-

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి తన నోటిదురుసు ప్రదర్శించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీకి సిద్ధమవుతున్న ట్రంప్‌ ఇటీవల సీఎన్‌ఎన్‌ టెలివిజన్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 2020 ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని ట్రంప్‌ మళ్లీ ఆరోపించారు. న్యాయస్థానాలు రిగ్గింగుకు ఆధారాలు లేవని తేల్చినా ట్రంప్‌ పాత పాటే పాడుతున్నారు.

2020లో అధ్యక్షునిగా జో బైడెన్‌ ఎన్నికను సవాలు చేస్తూ ట్రంప్‌ మద్దతుదారులు పార్లమెంటు (కాంగ్రెస్‌)పై దండెత్తారు. బైడెన్‌ ఎన్నికను ధ్రువీకరిస్తూ నాటి ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ చేస్తున్న ప్రకటనను అడ్డుకోడానికి ప్రయత్నించారు. ఎన్నిక ఫలితాన్ని నిలిపివేసే అధికారం పెన్స్‌కు లేకపోయినా ఉందంటూ ట్రంప్‌ బుకాయించారు. పెన్స్‌ తప్పు చేశారని ఇంటర్వ్యూలో మళ్లీ ఉద్ఘాటించారు. 2024 అధ్యక్ష ఎన్నికలు నిజాయితీగా జరిగితేనే ఫలితాన్ని ఆమోదిస్తానన్నారు.

జీన్‌ కెరోల్‌ అనే పాత్రికేయురాలిపై ట్రంప్‌ లైంగికదాడికి పాల్పడినట్లు నిర్ధారించిన న్యూయార్క్‌ కోర్టు జ్యూరీ కెరోల్‌కు ట్రంప్‌ 50 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలని మంగళవారం తీర్పు చెప్పింది. సీఎన్‌ఎన్‌ ఇంటర్వ్యూలో ట్రంప్‌ దీన్ని బోగస్‌ కేసుగా వర్ణించారు. కెరోల్‌ పిచ్చిపట్టిన మనిషి అని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news