టర్కీ, సిరియాలో భూకంపం.. 360 మంది మృతి

-

టర్కీ, సిరియాలో తెల్లవారుజామునే భూకంపం బీభత్సం సృష్టించింది. భారీ భూకంపం సంభవించడంతో పలు నగరాల్లో వందలాది భవనాలు కుప్పకూలాయి. ఈ విలయంలో ఇప్పటి వరకు 360 మంది మృతిచెందగా.. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.

స్థానిక కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది.  భూకంప లేఖినిపై దీని తీవ్రత 7.8గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. టర్కీలోని గాజియాన్‌తెప్‌ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం సంభవించిన పావుగంట తర్వాత 6.7తీవ్రతతో మరోసారి శక్తిమంతమైన ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

భూకంపం ధాటికి లెబనాన్‌, సైప్రస్‌లోనూ భూమి కంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వచ్చిన భూకంపం ఈ శతాబ్దంలోనే అత్యంత శక్తివంతమైందని అధికారులు అంచనా వేస్తున్నారు. మెుదటి భూకంపం తర్వాత మరోసారి భారీ ప్రకంపనలు వచ్చినట్లు వెల్లడించారు. తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ విలయం జరగడం వల్ల మృతుల సంఖ్య భారీగా పెరుగుతోందని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news