ఇమ్రాన్‌ ఖాన్‌కు షాక్.. ఐదేళ్లపాటు నిషేధం విధించిన పాక్ ఈసీ

-

ఇమ్రాన్‌ ఖాన్‌కు పాకిస్తాన్ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌పై ఐదేళ్ల పాటు నిషేధాన్ని విధించించింది. ఆర్టికల్‌ 63(1)(పి) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఈసీ తెలిపింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ తన డిక్లరేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఈసీ అధికారులు తేల్చారు. ఎన్నికల సంఘం నిర్ణయంతో ఇమ్రాన్‌ ఖాన్‌ జాతీయ అసెంబ్లీ నుంచి అనర్హత వేటుకు గురయ్యారు. ఐదేళ్ల వరకు ఆయన పార్లమెంట్‌ ఎన్నికకు అనర్హుడు.

 

ఐదేళ్ల నిషేధం పూర్తయ్యే వరకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 63 (1) (p) ప్రకారం పార్లమెంట్‌కు కానీ, అసెంబ్లీకి కానీ ఇమ్రాన్‌ పోటీ చేయరాదు. ఒకవేళ ఎన్నికైనా, లేదా ఎంపికైనా .. దానికి అర్హత ఉండదు. చీఫ్‌ ఎలక్షన్‌ కమీషనర్‌ సికందర్‌ సుల్తాన్‌ రాజా నేతృత్వంలోని నలుగురు సభ్యుల బెంచ్‌ ఈ తీర్పును వెలువరించింది.

తీర్పు ప్రకారం తోషాఖానా కేసులో తప్పుడు సమాచారం ఇచ్చిన ఇమ్రాన్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం ఇచ్చిన తీర్పును పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ ఖండించింది. ఇమ్రాన్‌ను ఎవరూ అనర్హుడిగా ప్రకటించలేరని, కేవలం ప్రజలు మాత్రమే ఆ తీర్పు ఇవ్వగలరని పీటీఐ నేతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news