నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు… ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? ఆయితే మీకు గుడ్ న్యూస్. భారత్ ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 125 ఐటీ ప్రొఫెషనల్స్, ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసారు.

పూర్తి వివరాలను చూస్తే… ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి కానీ బీఈ/బీటెక్‌/ఎంటెక్‌/ఎంసీఏ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. అలానే పనిలో అనుభవం ఉండాలి. వారే అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇక వయస్సు విషయానికి వస్తే.. వయస్సు 30 నుంచి 62 యేళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలు, స్కిల్‌ టెస్ట్‌, అనుభవం ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఇక పోస్టుల వివరాలను చూస్తే.. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ పోస్టులు: 36, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ పోస్టులు: 4, రిస్క్ అనలిస్ట్ పోస్టులు: 10, పవర్ అండ్‌ ఎనర్జీ సెక్టార్ lT & OT సెక్యూరిటీ కన్సల్టెంట్ పోస్టులు:3, డేటా ఎసెన్షియల్‌: సెంటర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ పోస్టులు: 2 తదితర పోస్టులు వున్నాయి. పోస్టులకి సంబంధించి లిస్ట్ ని నోటిఫికేషన్ లో చూడచ్చు. బీఈ/బీటెక్‌/ఎంటెక్‌/ఎంసీఏ లేదా తత్సమాన కోర్సు ప్యాస్ అయ్యి అనుభవం ఉంటే అప్లై చేసుకోండి.

పూర్తి వివరాలను https://ntro.gov.in/ntroWeb/loadRecruitmentsHome.do లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news