గూగుల్ లో చూసి ఫ్లైట్ లో ఫ్రీగా చెక్కేశాడు. టికెట్ లేకుండా విమానంలో తిరిగిన 9 ఏళ్ల బాలుడు

-

తొమ్మిదేళ్ల బాలుడు.. ఇంటి నుంచి పారిపోయాడు. మహా అయితే పక్క ఊరికో లేకపోతే, ఎవరైనా తెలిసిన వారి ఇంటికో వెళ్తుంటారు. కానీ బ్రెజిల్ లో ఓ 9 ఏళ్ల బాలుడు మాత్రం ఇంటి నుంచి పారిపోయి. విమానంలో దాదాపుగా 2700 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఏకంగా దేశంలో మరోవైపు ఉన్న నగరానికి వెళ్లాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే… విమానం టికెట్ లేకుండానే ఇదంతా కానిచ్చేశాడు. సాధారణంగా విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్ లేకుండా ఎంటర్ కావడానికే అవకాశం ఉండదు. కానీ ఏకంగా ఈ బుడతడు మాత్రం ఎలాంటి టికెట్ లేకుండా ఏకంగా ఫ్లైట్ లోకి వెళ్లి దర్జాగా తిరిగాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్ కు చెందిన బాలుడు ఇమాన్యుయేల్ మార్క్వెస్ డి ఒలివెరా శనివారం ఉదయం మనౌస్ నగరంలో తప్పిపోయినట్లు అతని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇమాన్యుయేల్ తల్లి, డానియెల్ మార్క్వెస్.. తెల్లవారుజామున లేచినప్పుడు తన కొడుకు తన మంచంలో పడుకున్నాడని అధికారులకు చెప్పారు. అయితే, రెండు గంటల తర్వాత మళ్లీ అతడిని తనిఖీ చేసేందుకు వెళ్లగా అతడు కనిపించకుండా పోయాడని పేర్కొంది.

అయితే బాలుడు ఇమాన్యుయేల్ కు ఎవరూ గమనించకుండా.. టికెట్ లేకుండా విమానంలో ఎలా ప్రయాణించాలో గూగుల్ లో చూసి విమానం ఎక్కేందుకు వెళ్లాడు. బ్రెజిల్‌కు వాయువ్యంగా ఉన్న మనౌ నుండి ఆగ్నేయ రాష్ట్రమైన సావో పాలోలోని గౌరుల్హోస్ నగరానికి లాటమ్ విమానంలో బాలుడు 1,677 మైళ్లు ప్రయాణించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news