Facebook ఉద్యోగులకు షాక్.. మరో 10వేల మందికి ఉద్వాసన

-

ఆర్థిక మాంద్యం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులను భయ భ్రాంతులకు గురిచేస్తోంది. ఏ నిమిషంలో తమ ఉద్యోగం ఊడుతుందోనని క్షణక్షణం భయపెడుతోంది. ఇప్పటికే పలు సంస్థలు భారీ లేఆఫ్స్ ప్రకటించాయి. తాజాగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌ మరోసారి భారీగా ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది.

గత నవంబరులో మెటా సంస్థ 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. తాజాగా రెండో విడతలో మరో 10 వేల మందిని తొలగించడానికి రెడీ అయింది. ఉద్యోగాల తొలగింపు విషయమై ఫేస్‌బుస్ సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఓ సందేశాన్ని సిబ్బందికి పంపారు. అంతే కాకుండా ఓపెన్ రోల్ విభాగంలో నియమిస్తామని చెప్పిన 5 వేల మందిని కూడా తీసుకోమని స్పష్టం జుకర్​బర్గ్ స్పష్టం చేశారు.

“నేను 2023లో సంస్థ నుంచి ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని ముందే చెప్పాను. వ్యాపార పనితీరు మెరుగుపరచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం చాలా కఠినంగా అనిపించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల తొలగింపు తప్పట్లేదు” -మార్క్ జుకర్​బర్గ్, ఫేస్​బుక్ సీఈఓ

Read more RELATED
Recommended to you

Latest news